Home Page SliderInternational

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఆశలు వీరి మీదే..

డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా, క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన రెజ్లర్ వినేశ్ ఫొగట్ మీదే భారత ఒలింపిక్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో కూడా తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్లకు బల్లెం విసిరి ఫైనల్‌కు దూసుకెళ్లారు. గ్రూప్ బీలో నీరజ్ చోప్రా మొదటి స్థానంలో ఉన్నారు. గురువారం రాత్రి ఫైనల్ పోటీలు జరగనున్నాయి. మహిళల 50 కేజీల రెజ్లింగ్ ప్రిక్వార్టర్స్‌లో వినేష్ ఫొగట్ సత్తా చాటి జపాన్‌కు చెందిన సుసాకీని 3-2 తేడాతో ఓడించి క్వార్టర్స్‌లోకి చేరుకుంది. వీరిద్దరిలో ఎవరైనా  భారత్‌కు 4వ పతకాన్ని తీసుకువచ్చే అవకాశాలున్నాయి.