భారత్ ఆశలు గల్లంతు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భారత్ ఆశలు గల్లంతయ్యాయి. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌పై అసీస్ సునాయాసంగా విజయం సాధించింది. 340 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(84), రిషభ్ పంత్ (30) తప్ప మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగులు చేయగా, భారత్ 369 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్‌లో ఆసీస్ 234 పరుగులకు ఆలౌటయ్యింది. దీనితో మరో మ్యాచ్ ఉన్నప్పటికీ మెల్‌బోర్న్ టెస్టు ఇక అసీస్ కైవసమయినట్లే.