పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు చేజారిన భారత్ ఆశలు
పారిస్ ఒలింపిక్స్‌లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపరిచారు. షూటింగ్ 10 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో సరబ్ జోత్ సింగ్, అర్జున్ చీమాలకు టాప్ 8లో చోటు దొరకలేదు. సరబ్ 9 వస్థానానికి, అర్జున్ 18 వస్థానానికి పరిమితమయ్యారు. అటు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్, రమిత -అర్జున్ బబుతా జోడీలు రెండూ నిరాశపరిచాయి. టాప్ 4కు చేరలేకపోయాయి. పురుషుల సింగిల్ స్కల్స్ హీట్స్‌లో భారత్ తరపున పోటీ చేసిన బాల్ రాజ్ పన్వర్ 4 వస్థానంలో నిలిచారు. దీనితో ఆయన సెమీస్, లేదా ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది.

