అంతర్జాతీయ వేదికపై భారత్ ఘనత
మొట్టమొదటి సారిగా భారత్‌కు అంతర్జాతీయ వేదికపై బంగారు కిరీటం లభించింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 పోటీలలో పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా పోటీలో విజయం సాధించారు. ఈ పోటీలలో భారత్‌కు లభించిన తొలి కిరీటం ఇదే కావడం విశేషం. దీనితో పాటుగా గ్రాండ్ పేజెంట్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్నారు. ఈ పోటీలలలో 70 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ చరిత్రలో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలు గెలిచినా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలలో గెలుపొందడం ఇదే తొలిసారి. రాచెల్ తన ఇన్‌స్టా పేజీలో మనం గెలిచాం, మొదటి గోల్డెన్ క్రౌన్‌ను సాధించాం అంటూ పోస్టు చేశారు.

