పారిస్ ఒలింపిక్స్‌లో మొదటి బోణీ కొట్టిన భారత్ షూటర్
ఎట్టకేలకు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ మొదలయ్యింది. భారత్ షూటర్ మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్‌లో టాప్ 3లో నిలిచి పైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్వాలిఫికేషన్ పోటీలో ఆమె 580 స్కోరును సాధించింది. ఆదివారం జరగబోయే ఫైనల్ పోరులో కూడా టాప్‌లో నిలిస్తే భారత్‌కు పతకం దక్కే అవకాశాలున్నాయి.

