లడఖ్‌లో దేశంలోనే తొలి NIGHT SKY SANTUARY
ఖగోళ పరిశోధకులకు శుభవార్త. ఆకాశంలో వింతలను చూడాలని, గ్రహాలపై పరిశోధనలు చేయాలనుకునే ఔత్సాహికులకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఒకNIGHT SKY SANTUARYని లడఖ్‌లో ఏర్పాటు చేయనుంది. ఖగోళ పరిశోధకుల సందర్శనకు వీలుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. లడఖ్‌లోని చాంగ్తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోనే హాన్లే వద్ద డార్క్ స్కై రిజర్వ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది దేశంలోనే మొట్ట మొదటి NIGHT SKY SANTUARY. ఈ ప్రదేశం చాలా ఎత్తైనది కావడం వల్ల ఖగోళ పరిశోధనలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాంతం మానవ సంచారానికి దూరంగా కూడా ఉంటుంది. అక్కడ ఆకాశం నిర్మలంగా ఉండడం, సంవత్సరమంతా పొడి వాతావరణం ఉండడం వల్ల ఈ ప్రాంతం నుండి స్పష్టంగా ఆకాశాన్ని పరిశోధించవచ్చు. ఇక్కడ ఆప్టికల్, ఇన్ ఫ్రారెడ్, గామా రే టెలిస్కోపులు కూడా ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఏర్పాటు కోసం లడఖ్ కేంద్రపాలిత ప్రాంత యంత్రాంగం, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కూడా కుదిరింది.

