ఒలింపిక్స్‌లో భారత్ మొదటి బుల్లెట్..మనుబాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట ప్రారంభమయ్యింది. 13 ఏళ్ల అనంతరం షూటింగ్‌లో భారత్‌కు తన బుల్లెట్‌తో మొదటి పతకం తీసుకువచ్చింది మనుబాకర్. హరియాణాకు చెందిన మను ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి మహిళా షూటర్‌గా నిలిచింది. ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఆమె 14 ఏళ్ల వయస్సులోనే షూటింగ్‌పై అనురక్తి పెంచుకుంది. తండ్రి సహకారంతో 14 ఏళ్ల వయస్సు నుండే షూటింగ్ ప్రాక్టీస్ చేసేది. రోజులో ఎక్కువ సమయం షూటింగ్ ప్రాక్టీసుకే కేటాయించేది. షూటింగ్‌తో పాటు గుర్రపు స్వారీపై కూడా ఆమెకు మక్కువ ఎక్కువ. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి ఒలింపిక్స్‌లో పతకం సాధించినందుకు ఆమెను అభినందించడం విశేషం.

