Home Page SliderNationalSports

అదరగొట్టిన భారత్ బౌలర్లు..

నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత బౌలర్లు కళ్లు చెదిరే పెర్‌ఫామెన్స్‌తో అదరగొట్టారు. భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 47.4 ఓవర్లకే ఆలౌట్ చేశారు. ఒక దశలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 75 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ వికెట్లు శరవేగంతో పడగొట్టారు. ఒకే ఓవర్‌లో ఇద్దరిని పెవిలియన్‌కు పంపారు. హర్షిత్ రాణా 3, జడేజా 3, షమీ, కులదీప్, అక్షర్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ బట్లర్(52), బెథెల్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. నిజానికి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ టీమ్ ఇండియాను కాస్త భయపెట్టింది. అయితే 8వ ఓవర్ వద్ద చివరి బంతికి సాల్ట్ భారీ షాట్ ఆడి, బౌండరీ లైన్ వద్ద శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్‌లో అవుటయ్యాడు. మూడు వన్డేల మ్యాచ్‌లో మొదటి మ్యాచ్ శుభారంభం కావడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆడుతున్న వన్డే సిరీస్ కావడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.