Home Page SliderInternational

అమెరికాలో ‘అన్నమో రామచంద్రా’ అంటున్న భారతీయులు

అమెరికాలో హఠాత్తుగా బియ్యానికి కొరత వచ్చింది. భారతీయులు ‘అన్నమో రామచంద్రా’ అని మొత్తుకుంటున్నారు. అమెరికాలోని డిపార్టమెంటల్ స్టోర్స్‌లో బియ్యానికి ఎన్నడూలేని డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే విదేశాలకు బియ్యం ఎగుమతులపై భారత్ నిషేదం విధించింది.  బాస్మతి బియ్యి, సోనామసూరి, ఇడ్లీ బియ్యం సహా ఏది దొరికితే అది పట్టుకుపోతున్నారు. దీనితో ఇప్పటికే చాలా స్టోర్స్‌లో ఒకరికి ఒక బ్యాగే అనే కండిషన్‌పై అమ్ముతున్నారు. కొన్నిచోట్ల అధిక ధరలకు అమ్ముతున్నారు.

ప్రపంచంలోని 90 శాతం బియ్యం ఆసియా నుండి ఉత్పత్తి అవుతుంటే అందులో భారత్ వాటా 45 శాతం పైనే. బాస్మతి బియ్యం అయితే 80 శాతం భారత్ వాటానే. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడంతో దేశంలో చాలా చోట్ల వరినాట్లు ఆలస్యమయ్యాయట. దీనితో పంటలు నష్టం జరిగాయి. దీనితో భారీగా బియ్యం ధరలు పెరగనున్నాయని అంచనాలు వేస్తున్నారు. అందుకే బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం జరిగింది. ఆహార భద్రత కింద కేంద్రప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. దీనితో తెలుగువారు సహా అమెరికాలో భారతీయులు బియ్యం కోసం క్యూలు కడుతున్నారు.