అమెరికాలో డాక్టర్లపై ఇండియన్స్ ఒత్తిడి
అమెరికాలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలయ్యింది. నూతన అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేసిన పుట్టుకతో పౌరసత్వ విధానం ఫిబ్రవరి 20 నుండి రద్దు కాబోతోంది. కాబట్టి ప్రస్తుతం గర్భవతులుగా ఉన్న తమకు నెలలు నిండకపోయినా సిజేరియన్లు చేయాలంటూ డాక్టర్ల వెంట పడుతున్నారట ఇండియన్స్. ఈ లోగా డెలివరీ అయితే తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం వస్తుందనే ఆశతో వీరిలా చేస్తున్నారని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. ఇకపై చట్టబద్దంగా అమెరికాలో పౌరులుగా కొనసాగుతున్నవారికి పుట్టే పిల్లలకే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అక్రమ వలసదారులు, విజిటింగ్ వీసాలపై వెళ్లేవారికి అక్కడ పిల్లలు పుడితే ఈ పౌరసత్వం వర్తించదు. గత వందేళ్లుగా ఉన్న ఈ సదుపాయాన్ని ట్రంప్ తాజా నిర్ణయంతో రద్దు చేశారు. రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్‌ను సవరించి ఈ విధానాన్ని రద్దు చేశారు.