భారత మహిళా టీమ్ ఘనవిజయం..
టీమిండియా మహిళల జట్టు, వెస్టిండీస్ టీమ్‌పై ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ టీమ్ ముందుగా బ్యాటింగ్ చేసి, 38.5 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటయ్యింది. వెస్టిండీస్ టీమ్‌లో హెన్రీ 61 పరుగులు, క్యాంప్ బెల్ 46 పరుగులు చేశారు. భారత్ జట్టులోని దీప్తి 6 వికెట్లు, రేణుక 4 వికెట్లు తీశారు. టీమ్ ఇండియా 28.2 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించారు. దీప్తి 39 పరుగులు, రిచా ఘోష్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీనితో వన్డే సిరీస్‌ను 3-0తో టీమిండియా కైవశం చేసుకుంది.