కెనడాలో భారత యువతిపై దాడి
కెనడాలో భారత్ పై విద్వేషం నానాటికీ పెరుగుతోంది. తాజాగా ఓ దుండగుడు భారత యువతిపై దాడికి తెగబడ్డాడు. ఆమె గొంతు నులుముతూ హత్యా యత్నం చేశాడు. కాపాడాలంటూ యువతి అరుస్తున్నా అక్కడెవరూ రాలేదు. అయితే, జనం పెరుగుతుండటంతో దుండగుడు ఆమెను అక్కడే వదిలేసి వేగంగా వెళ్లిపోయాడు. కాల్గరిలోని బోవ్యాలీ కాలేజీ రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.