పాకిస్తాన్ బందీగా భారత్ జవాన్
భారత్-పాక్ మధ్య వివాదం ముదురుతోంది. పాక్ కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వెంబడి నేటి తెల్లవారుజాము నుండి కాల్పులకు తెగబడింది. భారత భద్రతా బలగాలు కూడా ఎదురుదాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ జవాన్‌ను తమ భూభాగంలోకి ప్రవేశించాడనే నెపంతో బంధించింది పాకిస్తాన్. దీనితో అక్రమంగా బంధించారంటూ భారత్ ఆరోపించింది. జమ్ముకశ్మీర్‌లోని బందిపొరాలో కల్నార్ బజిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. దీనితో ముష్కరులు కాల్పులు జరిపారు. ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ తాజా ఉద్రిక్తతల మధ్య భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్తున్నారు. ఆయన శ్రీనగర్, ఉదమ్‌పూర్‌లలో పర్యటించి ఆర్మీ కమాండర్లతో భేటీ కానున్నారు.

