అశ్లీల వీడియోల కేసులో అమెరికాలో భారతీయుడికి 16 ఏళ్ల జైలుశిక్ష
అమెరికాలో అశ్లీల వీడియోలు సరఫరా చేస్తున్న కేసులో ఓ భారతీయుడుకి ఏకంగా 16 సంవత్సరాల పాటి జైలుశిక్ష పడింది. గోవాకు చెందిన అంగెలో విక్టర్ ఫెర్నాండెజ్ (34) అనే వ్యక్తి అమెరికాలోని ఓ క్రూయిజ్ నౌకలో పని చేస్తున్నాడు. ఇతను గత సంవత్సరం చిన్నపిల్లల అశ్లీల వీడియోలను, అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియోలను డానియల్ స్కాట్ అనే వ్యక్తికి ఓ మెసేజింగ్ యాప్ ద్వారా పంపించాడు. ఈ డానియల్ నేరాన్ని అంగీకరించడంతో అతడికి 2022లోనే శిక్ష విధించారు. చిన్నపిల్లలతో అసభ్యకర వీడియోలు చిత్రీకరించడానికి మరో వ్యక్తితో కూడా సంప్రదింపులు జరుపినట్లు దర్యాప్తులో నిరూపణ కావడంతో ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు అతనికి 188 నెలల పాటు అంటే సుమారు 16 ఏళ్ల పాటు జైలుశిక్ష విధించింది.

