Home Page SliderInternational

థాయ్‌ల్యాండ్‌లో అరెస్టైన 80 మంది భారతీయ గ్యాంబ్లర్స్

థాయ్‌ల్యాండ్‌లోని పటాయాలో 80 మంది భారతీయ గ్యాంబ్లర్స్ అరెస్టయ్యారు. వీరిలో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ గ్యాంబ్లర్స్ గ్యాంగ్‌లో చికోటి ప్రవీణ్‌కు చెందిన హోటల్‌లో గ్లాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు భారతీయులు. ఈ దాడిలో 20.92 కోట్ల రూపాయల విలువైన గేమింగ్ చిప్స్‌ను, 92 సెల్‌ఫోన్స్‌ను, 3 నోట్‌బుక్స్, ఐప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు థాయ్ పోలీసులు. 1.60 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రదేశంలో 100 కోట్ల రూపాయల విలువైన బెట్టింగ్ జరుగుతున్నట్లు గుర్తించబడింది. చికోటి ప్రవీణ్ అనే హైదరాబాద్‌కు చెందిన ఈ గ్యాంబ్లర్‌ను ఇప్పటికే క్యాసినో కేసుల్లో ఈడీ విచారించింది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో ఉన్న లింకులు కూడా దేశవ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించాయి.