ఖలిస్తానీ మద్దతుదారుల దుశ్యర్యకు ఇండియన్ ఎంబసీ కౌంటర్
అమృత్‌పాల్ సింగ్‌పై అణిచివేతకు నిరసనగా ఖలిస్తానీ మద్దతుదారులు దుశ్చర్యకు దిగారు. లండన్‌లో భారత హైకమిషన్ భవనం వెలుపల జాతీయ జెండాను తీసివేయడంతో అలజడి రేగింది. ఐతే కొద్దిసేపటికే… లండన్‌లోని భారత హైకమిషన్ భవనానికి భారీ త్రివర్ణ పతాకం అలంకరించి టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా రియాక్ట్ అయ్యింది. లండన్‌లోని ఆల్డ్‌విచ్‌లోని ఇండియా హౌస్ వద్ద భారీ జాతీయ జెండాను ఉంచి.. జాతి గౌరవాన్ని నిలబెట్టింది. ఖలిస్తానీ మద్దతుదారుడు జాతీయ జెండాను కిందకు దించేసిన విజువల్స్ దేశ ప్రజలను ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఈ ఘటనపై భారతీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ జెండాను విసిరేసిన హైకమిషన్ అధికారి సాహసోపేతమైన చర్యను పలువురు ప్రశంసించారు.

భారత జెండాను తీసివేస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రచారంలోకి రావడంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం సాయంత్రం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ క్రిస్టినా స్కాట్‌ను పిలిపించింది. హైకమిషన్ ప్రాంగణంలో భద్రత లేకపోవడం గురించి మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. భారత దౌత్యవేత్తలు, సిబ్బంది పట్ల UK ప్రభుత్వ ఉదాసీనత ఆమోదయోగ్యం కాదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఖలిస్తాన్ వేర్పాటువాదుల తీరుపై ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ చర్యపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. “ఝండా ఊంచా రహే హమారా”- లండన్‌లోని హైకమిషన్‌లో భారత జెండాను అగౌరవపరిచేందుకు ప్రయత్నించిన దుర్మార్గులపై UK ప్రభుత్వం చర్య తీసుకోవాలి. పంజాబ్ & పంజాబీలకు అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. దేశానికి సేవ చేయడం రక్షించడం చేస్తారు. UKలో కూర్చున్న కొన్ని జంపింగ్ జాక్‌లు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించవన్నారు బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్.
భారత హైకమిషన్‌లో జరిగిన హింసాత్మక చర్యను ఖండించారు లండన్ మేయర్ సాదిక్ ఖాన్. లండన్‌లో ఇలాంటి ప్రవర్తనకు చోటు లేదన్నారు. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. భారత హైకమిషన్‌పై జరిగిన దాడి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని UK విదేశీ కామన్వెల్త్ & అభివృద్ధి వ్యవహారాల మంత్రి లార్డ్ తారిక్ అహ్మద్ ట్వీట్ చేశారు. UK ప్రభుత్వం ఎల్లప్పుడూ భారత హైకమిషన్ భద్రతను తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన అన్నారు.
లండన్‌లోని భారత హైకమిషన్ భవనంలో ఖలిస్తాన్ మద్దతుదారులు జాతీయ జెండాను కిందకు లాగిన వెంటనే, అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై భారీ గుంపు దాడికి తెగబడింది. పెద్ద ఎత్తున పంజాబీ సంగీతం వినిపించి.. తక్షణం అమృత్‌పాల్‌ను విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు. భవనం వెలుపలి గోడపై అమృత్ పాల్ వదిలేయాలని స్ప్రే-పెయింట్స్ వేశారు. ముగ్గురు వ్యక్తులు, బహుశా భారత కాన్సులేట్ ఉద్యోగులు, ప్రవేశ ద్వారం సమీపంలో ఉన్న భవనంలో ఉంచిన ఖలిస్తాన్ జెండాలను తొలగించారు. కాన్‌బెర్రాలో, పంజాబ్‌లో అమృతపాల్ సింగ్ అతని సహచరులపై పోలీసుల అణిచివేతకు వ్యతిరేకంగా ఖలిస్తాన్ మద్దతుదారులు ఆస్ట్రేలియా పార్లమెంటు వెలుపల ఆందోళనకు దిగారు.