‘భారతీయ బ్యాంకులదే తప్పు’..విజయమాల్యా
ఆర్థిక నేరస్థునిగా పరిగణిస్తూ తనను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టులో ప్రయత్నిస్తున్న తరుణంలో కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ బ్యాంకులదే తప్పంతా అని పేర్కొన్నారు. వివిధ బ్యాంకులలో తాను చెల్లించాల్సిన బాకీలు రూ.6 వేల కోట్లయితే, ఇప్పటి వరకూ తన ఆస్థుల నుండి రూ.14 వేల కోట్లు రికవరీ చేశాయని, ఇది రెట్టింపు కన్నా ఎక్కువని వ్యాఖ్యానించారు. దీనికి సాక్ష్యంగా మాల్యా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొన్న నివేదికలోనే రూ.14,131 కోట్లు రికవరీ అయ్యాయని పేర్కొన్నాయని అన్నారు. 2016లో బ్రిటన్‌కు ఉద్దేశపూర్వకంగా విజయ్ మాల్యా పారిపోయినప్పటికీ బ్యాంకులకు ఎలాంటి నష్టం జరగలేదని, భారత్‌లోని తన ఆస్థులన్నీ ఎటాచ్ చేశారని పేర్కొన్నారు. దీనిని బ్యాంకులు కోర్టులో ఏ విధంగా సమర్థించుకుంటాయో చెప్పాలన్నారు.