Andhra PradeshHome Page SliderPolitics

ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఆస్తుల వేలం ప్రకటించిన ఇండియన్ బ్యాంకు..

బ్యాంక్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా అనే సంస్థ భారీగా రుణం తీసుకుని తిరిగి చెల్లించని వ్యవహారంలో రుణానికి హామీగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువుల ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ బ్యాంక్, కోరి స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, బకాయిలు వసూలు చేసేందుకు మే 21 మధ్యాహ్నం 12 గంటల నుండో సాయంత్రం 5 గంటల మధ్య మూడు స్థిరాస్తుల వేలం ప్రక్రియ జరగనుంది.2016 నాటికి రూ.141 కోట్లు ఉన్న రుణ బకాయిలు, 2025 ఏప్రిల్ 27 నాటికి వడ్డీ, పెనాల్టీలు కలిపి రూ.463.01 కోట్లకు పెరిగినట్టు బ్యాంకు తెలిపింది. ఈ రుణాలకు గంటాతో పాటు పరుచూరి రాజారావు, పీవీ భాస్కరరావు, పరుచూరి వెంకయ్య, ప్రభాకరరావు, కొండయ్య బాలసుబ్రమణ్యం, నార్ని అమూల్య, ప్రత్యూష ఎస్టేట్స్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్స్ హామీదారులుగా ఉన్నారు.