సూడాన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ఆపరేషన్
హింసాత్మకమైన సూడాన్‌లో గురువారం రాత్రి ఒక చిన్న ఎయిర్‌స్ట్రిప్ నుండి 121 మంది సిబ్బందిని రక్షించడానికి చీకట్లో తయారుకాని రన్‌వేలోకి ఎగురుతూ భారత వైమానిక దళం డేరింగ్ నైట్ ఆపరేషన్ నిర్వహించింది. భారత వైమానిక దళం తన C-130J హెర్క్యులస్ రవాణా విమానాన్ని ఒక ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ చేసింది. వాస్తవానికి అది నావిగేషనల్ అప్రోచ్ సహాయం లేకుండా, ఫ్యూయల్ లేకుండా, ల్యాండింగ్ లైట్లు లేకుండా దెబ్బతిన్న స్థితిలో ఉంది. రాత్రి పూట విమానాన్ని ల్యాండ్ చేయాలంటే ఇవన్నీ అవసరం. C-130J సుడాన్‌లోని వాడి సయ్యదినాలోని ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అయింది.

ఎయిర్ ఫోర్స్ పైలట్లు నైట్ విజన్ గాగుల్స్ (NVGs)ని ఉపయోగించి రాత్రి పూట విమానాన్ని ల్యాండ్ చేశారు. ఎయిర్‌స్ట్రిప్‌ను సమీపిస్తున్నప్పుడు, ఎయిర్‌క్రూ, ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్‌ఫ్రా-రెడ్ సెన్సార్‌లను ఉపయోగించి చిన్న రన్‌వేపై ఎటువంటి అడ్డంకులు లేవని నిర్ధారించుకున్నారు. సూడాన్‌లో హింసాకాండకు కేంద్రంగా ఉన్న ఖర్తూమ్‌కు ఉత్తరాన 40 కి.మీ దూరంలో ఉంది. రన్‌వే స్పష్టంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత, పైలెట్లు సాహసోపేతంగా భారతీయుల్ని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. వైమానిక దళం ప్రత్యేక దళాల విభాగానికి చెందిన ఎనిమిది మంది గరుడ కమాండోలు ప్రయాణీకులను సురక్షితంగా విమానంలో లగేజీతో సహా ఎక్కించారు. బ్లైండ్ ఎయిర్‌స్ట్రిప్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ల్యాండింగ్ చేసినట్టుగానే టేకాఫ్ కూడా NVGలను ఉపయోగించి చేశారు. వాడి సయ్యదినా- జెడ్డా మధ్య రెండున్నర గంటల ఆపరేషన్, గతంలో కాబూల్‌లో నిర్వహించిన ఆపరేషన్‌కు సమానంగా ఉంటుంది.

మానవతా సంక్షోభ సమయంలో సాహసోపేతమైన కార్యకలాపాలను నిర్వహించడానికి వైమానిక దళం సాహసానికి తాజా ఉదంతం మరో నిదర్శనం. సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి ‘ఆపరేషన్ కావేరీ’ కింద 754 మందిని ఇండియాకు తీసుకువచ్చింది. వైమానిక దళం సి-17 రవాణా విమానంలో 392 మందిని ఢిల్లీకి తరలించగా, మిగిలిన 362 మంది భారతీయులను బెంగళూరుకు తీసుకువచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం 1,360 మందిని ఇండియాకు తెచ్చారు. సుడాన్ ఆర్మీ, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భాగంగా సూడాన్‌లో నెల రోజుల నుంచి పరిస్థితి భీకరంగా మారింది.