యుద్ధానికి ప్రాక్టీస్ మొదలుపెట్టేసిన భారత్ వాయుసేన..
భారత్ -పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్న ఈ తరుణంలో భారత వాయుసేన యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లను పరీక్షిస్తోంది. దీనితో ఈ వార్త వైరల్‌గా మారింది. యూపీలోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వే మీద ఉన్న 3.5 కిలోమీటర్ల ఎయిర్ స్ట్రిప్‌పై సాధన కొనసాగుతోంది. దీనిని యుద్ధవిమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా నిర్మించారు. ఎక్స్‌ప్రెస్ రహదారి రన్‌వేకు ప్రత్యామ్నాయంగా దీనిని పరిశీలిస్తున్నారు. అత్యవసర పరిస్థితులలో ఈ రన్‌వే ఉపయోగపడుతుంది. ఇక్కడ దాదాపు 250 సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు చేయిస్తున్నారు. దీనికోసం రాష్ట్రప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంది.