రెండో టెస్టులో భారత్ అద్భుత గెలుపు
ఏం జరిగింది? ఎలా జరిగిందన్నది పక్కన పెడితే బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. కాన్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్… మొదటి మూడు రోజులు మ్యాచ్ అసలు జరగకుండా పోవడంతో అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అందరూ భావించారు. రెండో టెస్ట్ దాదాపు జరగదని భావించారు. ఐతే అనూహ్యంగా రెండ్రోజుల్లోనే ఫలితం ఇవ్వడం ప్రత్యేకమని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో అనూహ్య విజయాలు సాధిస్తున్న బంగ్లా జట్టు, ఇండియాలో జరిగిన టెస్ట్ సీరిస్ లో ఓటమి పాలవడం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకానొక సమయంలో పాకిస్తాన్ వెళ్లి, అక్కడ పాకిస్తాన్ జట్టును చిత్తుచిత్తుగా వచ్చిన బంగ్లా పులులు ఇండియా వస్తుంటే ఖబర్దార్ అంటూ హెచ్చరికలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలిటెస్టులో ఇండియా ఓటమి పాలవుతుందని అందరూ భావించారు. ఏస్ స్పిన్నర్ రవీంద్ర అశ్విన్ దుమ్మురేపడంతో ఇండియా విజయం సాధించింది. వరుసగా రెండు టెస్టుల్లోనూ బంగ్లా జట్టు అనుకోకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లుగా బంగ్లాదేశ్ పరిస్థితి కనిపించింది. ఇటీవల కాలంలో క్రికెట్లో దూసుకుపోతున్న బంగ్లా పులులు ఇండియాతో భారతదేశంలో జరిగిన సీరియస్‌ను ఓడిపోవడంతో ఒక కొత్త పరిణామాన్ని చూడాల్సి రానుంది. మొత్తంగా జైస్వాల్ రెండో టెస్టులో వరుసగా రెండో మ్యాచ్ లోను అర్ధశించి సాధించి సరికొత్త రికార్డులు బద్ధలుకొట్టాడు. ఇక భారత్ జట్టు ఈ సిరీస్ లో అద్భుత రికార్డును బ్రేక్ చేసింది. వేగంగా పరుగులు సాధించిన టెస్ట్ జట్టుగా ఆవిర్భవించగా, కింగ్ కోహ్లీ 27 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇటీవల కాలంలో విఫలమవుతున్న కోహ్లీ ఈ మ్యాచ్ లో రాణించి సత్తా చాటాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ కాగా, ఇండియా 285/9 పరుగులు వద్ద డిక్లేర్డ్ చేసింది.రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 146 పరుగులకు అలౌట్ కాగా, ఇండియా ముందు 95 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 3 వికెట్లను కోల్పోయిన ఇండియా 98 పరుగులు చేసింది. విక్టరీ షాట్‌ను కీపర్, స్టార్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కొట్టాడు.