రెండో వన్డేలో భారత్ గెలుపు.. సిరీస్ కైవసం
రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మహ్మద్ షమీ 3, మహ్మద్ సిరాజ్ 1, శార్దూల్ ఠాకూర్ 1, హార్దిక్ పాండ్యా 2, కుల్దీప్ యాదవ్ 1, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లను పడగొట్టారు. 34.3 ఓవర్లలోనే కివీస్‌ను 108 పరుగులకు ఆలౌట్ చేశారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ రెండకెల స్కోర్‌తో సరి పెట్టుకున్నారు. గ్లెన్ ఫిలిమ్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) పరుగులు తీశారు. 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగింది. 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ (51) నాటౌట్, హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో తన కెరీర్ 48వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. శుభ్‌మన్ గిల్ (40) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ (11) పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. కివీస్ బౌలింగ్‌లో హెన్రీ షిప్లే, మిచెల్ సాంట్నర్‌లకు తలో వికెట్ పడగొట్టారు. జనవరి 24న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగనుంది.

