తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
రాణించిన రాహుల్, జడేజా
రాహుల్ 75 నాటౌట్, జడేజా 45 నాటౌట్
39.5 ఓవర్లలో 5 వికెట్ల తేడాతో విజయం
వాంఖెడే స్టేడియంలో భారత్ భళా
ఆస్ట్రేలియా తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. రాహుల్ 75 నాటౌట్, రవీంద్ర జడేజా అజేయంగా 45 పరుగులు చేయడంతో, ఆస్ట్రేలియాతో జరిగిన 189 పరుగుల లక్ష్యాన్ని భారత్ 39.5 ఓవర్లలో ఛేదించింది. మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలిచింది. రాహుల్, జడేజా, టీమిండియాకు ప్రమాదకర పరిస్థితి రాకుండా మ్యాచ్‌ను ముగించారు. అతితక్కువ ఛేజింగ్‌లో ఆతిథ్య జట్టు టాప్-ఆర్డర్ దారుణ వైఫల్యంతో ఒకానొక సమయంలో ఇండియా ఓడిపోతుందా అన్న పరిస్థితి తలెత్తింది. ఆస్ట్రేలియాను అంతకుముందు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చిత్తు చేశారు. చెరో మూడు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఒక దశలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసి పటిష్టంగా కన్పించినప్పటికీ ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. 65 బంతుల్లో 81 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ అందించిన శుభారంభాన్ని జట్టు సభ్యులు అందుకోలేకపోయారు. వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన భారత స్టాండ్-ఇన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.