ఆసియా కప్ సెమీస్‌లో భారత్ ఘనవిజయం
ఆసియా కప్‌లో టీమిండియా మహిళల జట్టు చాలా సునాయాసంగా ఫైనల్స్‌కు దూసుకుపోయింది. సెమీస్‌లో బంగ్లాదేశ్ జట్టును 80 పరుగులకే కట్టడి చేశారు భారత్ బౌలర్లు. వీరికి ధీటుగా బ్యాటింగ్‌లో కూడా రాణించారు భారత్ అమ్మాయిలు. కేవలం 11 ఓవర్లలోనే 81 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. స్మృతి మంధాన 55 పరుగులు, షఫాలీ శర్మ 26 పరుగులతో అజేయంగా నిలిచారు. నేటి రాత్రి జరగబోయే మరో సెమీ ఫైనల్లో గెలిచిన జట్టుతో ఇండియా జట్టు ఫైనల్‌లో తలపడుతుంది. నేడు శ్రీలంక- పాకిస్తాన్ జట్లు సెమీ ఫైనల్‌లో ఆడబోతున్నాయి.