ఏసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ ఆసియాకప్‌లో భారత్ మహిళలదే విజయం
బుధవారం జరిగిన ఏసీసీ ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియాకప్-2023లో భారత జట్టు విజయం సాధించింది. ఈరోజు భారత్, బంగ్లాదేశ్ టీమ్‌ల మధ్య ఫైనల్స్ జరిగింది. దీనిలో భారత్ టీమ్ 31 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు సాధించింది. అనంతరం బంగ్లాదేశ్ టీమ్ 96 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. భారత్ బ్యాటర్లలో వృందా 36 రన్స్, కనిక అహుజా 30 రన్స్ సాధించారు. బౌలర్లలో శ్రేయాంక 4 వికెట్లు తీయగా, మన్నత్ కశ్యప్ 3 వికెట్లు తీసి జట్టు గెలుపుకి కారణమయ్యారు.