NationalNews

న్యూజీలాండ్‌తో సీరిస్ విజేత భారత్

న్యూజీలాండ్, ఇండియా టీ 20 సీరిస్ వర్షార్పణం అయ్యింది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తిగా జరిగింది. రెండో మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించడంతో సీరిస్ ఇండియా వశం అయ్యింది. మొదటి మ్యాచ్ రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఇండియా గెలవగా, మూడో మ్యాచ్ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టై అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్ 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇండియా 75 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ కొనసాగే అవకాశం లేకపోవడంతో డక్ వర్త్ లూయీస్ ప్రకారం టైగా ప్రకటించారు. సీనియర్లు లేకుండా యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలో టీమ్ ఇండియా న్యూజీలాండ్ పర్యటనకు వచ్చింది. న్యూజీలాండ్‌లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు… క్రికెట్ సీరిస్‌పై ప్రభావం చూపించాయి.