రాబోయే రెండు దశాబ్దాల్లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
భారత్ 2075 కల్లా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని గోల్డ్‌మాన్ సాక్స్ సర్వే తాజాగా వెల్లడించింది. అయితే ఇటీవల కాలంలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మొదటి దేశంగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా దేశంలో పెరుగుతున్న జనాభా సామర్థ్యాన్ని అనుగుణంగా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచడం,శిక్షణ ఇవ్వడం,నైపుణ్యాన్ని గుర్తించడం కీలకం కానుందని పేర్కొంది. ఈ మేరకు భారత్‌లో తయారీ రంగంలో స్థానిక ఉత్పత్తులు పెరుగుతాయని తెలిపింది. దీంతో రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్ ఇతరులపై ఆధారపడటం తగ్గనున్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది.

