Home Page SliderNationalNews AlertTrending Todayviral

‘తమ కుమార్తెలను భారత్ ఆహ్వానిస్తోంది’..సునీతకు మోదీ లేఖ

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతావిలియమ్స్ 9 నెలల అంతరిక్ష ప్రయాణం అనంతరం భూమికి తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను భారత ప్రధాని నరేంద్ర మోదీ సాదరంగా భారత్‌కు ఆహ్వానిస్తున్నారు. ఆమె సురక్షితంగా రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమెకు లేఖ రాశారు. మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నాం,  మీరు సాధించిన విజయాల పట్ల 140 కోట్ల మంది భారతీయులు గర్వంగా ఉన్నారని పేర్కొన్నారు. మీ అంతరిక్షయాత్ర విజయవంతం అయినందుకు శుభాకాంక్షలు. మీరు తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని భారత్‌లో చూడాలని కోరుకుంటున్నాం. తమ కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల భారత్ సంతోషంగా ఉంటుందంటూ లేఖలో రాశారు. ఈ లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ లేఖ పట్ల సునీత సంతోషం వ్యక్తం చేసి, దేశ ప్రజలకు, ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు.