సరికొత్త రికార్డు సృష్టించిన ఇండియా -పాకిస్తాన్ మ్యాచ్
వరల్డ్ కప్‌లో హైవోల్టేజ్ మ్యాచ్ అయిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ మరో రికార్డును నెలకొల్పింది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వ్యూవర్ షిప్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఇప్పటి వరకు ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. కాగా ఈ మ్యాచ్‌ను అత్యధికంగా 3.5 కోట్ల మంది తమ యాప్‌లో వీక్షించారని సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఈ బిగ్గెస్ట్ మ్యాచ్‌ను మరింత గొప్పగా మార్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఏడాది చెన్నై,గుజరాత్ మధ్య జరిగిన IPL ఫైనల్ మ్యాచ్‌ను 3.2కోట్లమంది వీక్షించారు. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ ఇప్పుడు వరల్డ్ కప్‌లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ను 3.5 కోట్లమంది వీక్షించడంతో IPLరికార్డ్ బ్రేక్ అయ్యింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు.

