భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ రద్దు
టాస్ కూడా పడకుండానే భారత్, న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ రద్దయింది. వెల్లింగ్టన్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా తొటి టీ20 మ్యాచ్ను రద్దు చేశారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20 శుక్రవారం వెల్లింగ్టన్లోని స్కై స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల నిర్వహించలేకపోయారు. కనీసం టాస్ కూడా పడలేదు. వర్షం తగ్గితే ఐదు ఓవర్ల ఇన్నింగ్స్ చొప్పున మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు అనుకున్నారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం కారణంగా ఆటగాళ్లు తమ డ్రెస్సింగ్ రూంలకే పరిమితమయ్యారు. ఈ నెల 20న, రెండో టీ20.. 22న మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది.

