Breaking NewsHome Page Sliderhome page sliderInternationalNationalNewsviral

రష్యా పై కోపంతో భారత్ కు సుంకాల శిక్షా .. భారత్కు వస్తున్న పుతిన్

భారత్ , రష్యా మైత్రి మరింత గట్టిగా బలపర్చేందుకు వ్లాదమిర్ పుతిన్ పర్యటనకు రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు రష్యా దేశాధ్యక్షుడు పుతిన్‌ భారతదేశ పర్యటనకు సంకల్పించారు. పుతిన్ కార్యాలయ వర్గలు ధృవీకరించాయి. ఈ నెల ఆగస్టు చివరలో ఆయన భారత్‌ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సందర్శన తేదీలను అతి త్వరలో ఖరారు చేయాల్సి ఉందని సంబంధిత అధికార వర్గాలు పెర్కోన్నాయి. ఈ క్రమంలో అజిత్‌ ఇటీవలే రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాలు మోత మోగించారు. తొలిగా 25 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్ నాంది పలికారు. తదనంతరం దాన్ని 50 శాతానికి పెంచి సంచలనం సృష్టించారు. ఈ క్రమంలో పుతిన్ భారత్ పర్యటనకు రావడం మరింత ప్రాధాన్యత నెలకొంది. పుతిన్- ట్రంప్ భేటీ ఇదిలాఉండగా రష్యా దేశాధ్యక్షుడు పుతిన్, అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ఇరువురు మధ్య రానున్న రోజుల్లో ఓ సమావేశం ఏర్పాటు కానుందని క్రెమ్లిన్ ఓ ప్రకటన చేశారు. రెండు దేశాలు ఈ భేటీకై ఎదురు చూస్తున్నాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనిలో భాగంగా ఓ అగ్రిమెంట్ కుదిరిందని దాని వివరాలను కలయిక అనంతరం ప్రకటిస్తామని రష్యా అధ్యక్ష కార్యాలయ విదేశాంగ సలహాదారు యూరి ఉషాకోవ్ల పెర్కోన్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తదనంతరం పుతిన్తో కలవడం ఇదే మెదటిసారి అవుతుంది. ఈ క్రమంలో మరోవైపు రష్యా వర్సెస్ ఉక్రెయిన్ పోరు గత మూడేళ్ల నుంచి కొనసాగుతోంది. యుద్ధాన్ని నిలపేస్తానని డోనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. యుద్ధం అపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదనలను ఇప్పటి వరకు పుతిన్ బేఖాతరు చేస్తు వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ట్రంప్ హెచ్చరికలను పెడచివిన పెడుతున్నారు. దీంతో తీవ్ర ప్రకోపానికి గురైన అమెరికా అధ్యక్షుడు భారత్ పై తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రష్యాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి , అది నుంచి మంచి మిత్ర దేశంగా ఉన్న భారత్పై సుంకాల పేరుతో సౌండ్ చేస్తున్నారు. భారత్ పై టారిఫ్ లతో డోనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్నారు.