పుణె టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమి
సొంతగడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 245 పరుగులకే ఆలౌటైంది. పుణేలో మూడ్రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టు మ్యాచ్ లో కివీస్ 113 పరుగుల భారీ తేడాతో నెగ్గి… మూడు టెస్టుల సిరీస్ ను 2-0తో చేజిక్కించుకుంది. తద్వారా భారత గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. కివీస్ స్పిన్నర్ శాంట్నర్ మొత్తం 13 వికెట్లతో సత్తా చాటారు. ఇక, భారత్ తన సొంతగడ్డపై ఓ టెస్టు సిరీస్ ను కోల్పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.

