జింబాబ్వేపై భారత్ సంచలన విజయం
టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న టీమ్ ఇండియా జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ తో సెమీస్ పోరుకు సిద్ధమైంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. భారత్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఇక కేఎల్ రాహుల్ 35 బంతుల్లో 51 పరుగులతో రాణించాడు. 187 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన జింబాబ్వే 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రియాన్ బర్ల్, సికిందర్ రాజా మినహా ఆటగాళ్లందరూ విఫలమయ్యారు.
