InternationalNews

సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి నెగ్గిన టీమ్‌ఇండియా

ఆట ప్రారంభంలో భారత్ కాస్త తడబడినప్పటికీ ఎట్టకేలకు జింబాబ్వేపై విజయం సాధించింది. భారత్‌లో వన్డే సిరీస్ తొలి రెండు మ్యాచుల్లో జింబాబ్వే 189 ఆలౌట్ ..161 ఆలౌట్‌తో బ్యాటింగ్ ప్రదర్శించింది. అలాంటి జట్టుకు మన టీమిండియా 290 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ సిరీస్‌లో ముఖ్యంగా శుభమన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్ ‌లో ఆయన తన కెరీర్‌లోనే మొట్టమొదటిగా శతకాన్ని(130) నమోదు చేశారు. ఈ మేరకు ఆయన జింబాబ్వే జట్టుకు భారీ లక్ష్యాన్నే నిర్దేశించారు.

 జింబాబ్వే ఈ లక్ష్యాన్ని ఛేదించడం పక్కన పెడితే..ఆతిథ్య జట్టు అసలు 200 పరుగులైనా చేస్తుందా అని అందరిలో సందేహం ఉంది. కానీ అందరి అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ..జింబాబ్వే మ్యాచ్‌లో అసాధారణ ప్రతిభను కనపరిచింది. ఈ మేరకు సికిందర్ రాజా 115 పరుగులతో 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా ఆటను కొనసాగించారు. దీంతో టీమ్‌ఇండియా కేవలం 13 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచింది. ఈ విధంగా టీమ్ ఇండియా ఓటమిని తప్పించుకొని ,సిరీస్‌ను  క్లీన్‌స్వీప్ చేసింది.