మణిపూర్ అంశంపై రాష్ట్రపతిని కలిసిన INDIA ఎంపీలు
మణిపూర్ బాధిత మహిళల కుటుంబాలను, అక్కడ పునరావాస కేంద్రాలను దర్శించి వచ్చారు కొందరు INDIA ఎంపీల బృందం. వారు ఈవిషయంపై రాష్ట్రపతి ద్రౌపదిముర్మును కలిసి వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. మణిపూర్‌లో బాధిత మహిళలు, వారి కుటుంబాలు నరకయాతన అనుభవించాయని, వారి పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని రాష్ట్రపతికి తెలియజేశారు. మణిపూర్ నుండి ఇద్దరు మహిళలను రాజ్యసభకు ఎంపీలుగా నామినేట్ చేయాలంటూ రాష్ట్రపతిని కోరారు. ఈ చర్యతో రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను సరిదిద్దేందుకు అవకాశం ఉంటుందని టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్ తెలియజేశారు. వారి మణిపూర్ పర్యటన వివరాలను కూలంకుషంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో చర్చించినట్లు తెలియజేశారు.