News

భారత్ ఘోర పరాజయం

న్యూజిలాండ్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచులో భారత్ ఘోరంగా ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు టామ్ లేథమ్ (0), డేవన్ కాన్వే (17) ఔటైనప్పటికీ.. మరో వికెట్ పడనీయకుండా విల్ యంగ్ (48), రచిన్ రవీంద్ర (39) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. టీమిండియా పేసర్ జన్ ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు టెస్ట్ ల సిరీస్ న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసెకెళ్లింది. చివరిసారిగా 1988లో భారత్ లో న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ విజయం సాధించడం గమనార్హం. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అవ్వగా, రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసింది.