రష్యాకు దగ్గరవుతున్న ఆ దేశం..భారత్ ఆందోళన
గత కొన్ని రోజులుగా జరుగుతున్న రష్యా, పాకిస్తాన్ సైన్యాధికారుల సమావేశాలు భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల రష్యా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ కల్నల్ జనరల్ అలెగ్జాండర్ వీ ఫోమిన్ పాకిస్తాన్ త్రివిధ దళాల అధిపతులతో విడివిడిగా సమావేశమై రక్షణ సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు. మరోపక్క బ్రిక్స్‌లో సభ్యదేశంగా మారేందుకు పాకిస్తాన్ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై రష్యాకు విజ్ఞప్తి చేసింది. ఈ సంవత్సరానికి భారత్ వ్యతిరేకత కారణంగా పాకిస్తాన్‌కు ఆహ్వానం లభించకపోయినా, తర్వాతికాలంలో ఏమవుతుందో చెప్పడం కష్టం. రష్యాతో, భద్రత, రక్షణ రంగాలలో తమ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పాకిస్తాన్ తహతహలాడుతోంది. రష్యాతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, పీఏఎఫ్ పరికరాల కోసం సాంకేతిక మద్దతు ఉంటుందని గతంలో రష్యాతో జరిగిన సమావేశంలోనే తెలియజేశారు.


 
							 
							