భారత్, అఫ్గానిస్థాన్‌పై యుద్ధానికి సిద్ధం
ఇస్లామాబాద్‌లో జరిగిన సూసైడ్ బాంబ్ దాడిలో 12 మంది మృతి, 36 మంది గాయాల నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, అఫ్గానిస్థాన్‌లతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థానీ తాలిబన్ (TTP) ప్రకటించుకున్నప్పటికీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం దాడి వెనుక భారత్ మద్దతు ఉందని ఆరోపించారు.
దీంతో ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

