ఇండియా ఈజ్ గ్రేట్-రష్యా అధ్యక్షుడు పుతిన్ హాట్ కామెంట్స్
నవంబర్ 4న రష్యా ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. భారతీయులు ప్రతిభావంతులు, సామర్థ్యం ఉన్నవారని… ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి పరంగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తోందనడంలో సందేహం లేకుండా భారతదేశానికి చాలా సామర్థ్యం ఉందన్నారు. నవంబర్ 4న రష్యా ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు భారత్‌ను కీర్తించారు. భారతదేశం అభివృద్ధి సాధిస్తోందని… ఎటువంటి సందేహాలు లేవన్నారు. సుమారు 150 కోట్ల మంది ప్రజలు భారతదేశానికి తరగని ఆస్తిగా ఉన్నారన్నారు. ఇండియా వైపు చూడండి.. ప్రతిభావంతులైన వ్యక్తులకు పుట్టినిల్లన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్.

ఇండియా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తోందని… అభివృద్ధి పరంగా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తోందన్నారు. వలస శక్తులలో సాధించిన శ్రేయస్సు స్థాయి ఆఫ్రికా దోపిడీలో ఉందని… అందరికీ తెలుసునన్నారు. వాస్తవానికి.. యూరప్‌లోని పరిశోధకులు ఈ వ్యవహారాలన్నింటినీ దాచరన్నారు. ఇది గణనీయమైన స్థాయిలో ఆఫ్రికన్ ప్రజల శోకం, బాధలపై నిర్మించబడిందన్నారు. దోపిడీ, బానిస వ్యాపారం – వాస్తవానికి… పుతిన్ అన్నారు. రష్యా ఒక బహుళజాతి రాజ్యం, విశిష్ట నాగరికత, సంస్కృతి కలిగిన దేశమన్నారు పుతిన్. రాయిటర్స్ అనువాదం ప్రకారం, దేశం గణనీయమైన రీతిలో యూరోపియన్ సంస్కృతిలో
భాగమని… మతం ద్వారా ఖండంతో ముడిపడి ఉందన్నారు.