News Alert

భారత్ మరో అరుదైన రికార్డ్

ట్వంటీ 20ల్లోనే కాకుండా టీమ్ ఇండియా వన్డేల్లోనూ అరుదైన రికార్డు సొంతం చేసుకొంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టిస్తూ టీమ్ ఇండియా ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా టీమిండియా మరో అరుదైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఛేజింగ్‌లో అత్యధికంగా 300సార్లు విజయం సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో గెలుపునతో ఈ రికార్డు సాధించింది. ఈ దరిదాపుల్లో కూడా ఏ జట్టు లేకపోవడం గమనార్హం. మెదటి స్ధానాన్ని భారత్ దక్కించుకోగా ఆస్ట్రేలియా (257) , వెస్టిండీస్ (247) తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.