Home Page SliderInternational

సౌతాఫ్రికా టెస్ట్‌లో భారత్ అమ్మాయిల జోరు

సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టీమ్ అమ్మాయిలు జోరుగా రన్స్ సాధిస్తున్నారు. స్టార్ బ్యాటర్స్ స్మృతి మంధాన 149 పరుగులు చేయగా, షఫాలీ వర్మ 128 పరుగులు చేసి, సెంచరీల మోత మోగించారు.దీనితో మొదటి వికెట్ పడే సమయానికి 52 ఓవర్లలో 292 పరుగుల రికార్డును సాధించారు. మరో సిక్స్ కొట్టడానికి ప్రయత్నించిన స్మృతి పెవిలియన్ బాట పట్టింది. తొలిరోజు స్మృతి 64 పరుగులు చేయగా, షఫాలీ 65 పరుగులు చేసింది. వీరిద్దరినీ ఔట్ చేయడానికి ఆరుగురు దక్షిణాఫ్రికా బౌలర్లు విశ్వప్రయత్నం చేశారు. మరోపక్క టీ 20లో కూడా టీమిండియా  పురుషుల జట్టు ఇంగ్లాండును ఓడించి, ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. దీనితో క్రికెట్‌లో భారత్‌కు ఎదురులేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.