Home Page Sliderhome page sliderInternational

భారత్ చెప్పిందే.. చేసింది.. సరిగ్గా బుద్ధి చెప్పింది..

ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోకి ఉగ్రమూకపై విరుచుకుపడుతోంది. అయితే.. ఈ దాడులకు కొద్దిసేపటి ముందు ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. “విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..!” అని పేర్కొంటూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై భారతీయుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. “భారత్ చెప్పిందే.. చేసింది.. సరిగ్గా బుద్ధి చెప్పింది”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరో వైపు ఆపరేషన్ సింధూర్ లో తీవ్రంగా గాయపడ్డ పాక్ టెర్రరిస్టులను పాక్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ పరామర్శించారు. బహవాల్ పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైషే మహమ్మద్ కు చెందిన టెర్రరిస్టుల ఆరోగ్య పరిస్థితిని పాక్ ఆర్మీ అధికారి అడిగి తెలుసుకున్నారు.