లద్దాఖ్ విషయంలో భారత్-చైనా ఒప్పందం
లద్దాఖ్‌లో భారత్-చైనా సరిహద్దు వివాదం విషయంలో ఇరుదేశాల సైనికాధికారుల మద్య చర్చలు జరిగాయి. వీరు ఒక ఒప్పందానికి వచ్చారని సమాచారం. కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాదం పరిష్కారమవుతుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఒప్పందంలో వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్ పునఃప్రారంభించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్-చైనా సరిహద్దులోని గల్వాన్ లోయలో 2020 నుండి ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాలు అక్కడ భారీ స్థాయిలో బలగాలు మొహరించాయి. అయితే ఇటీవల పరిణామంతో పరిస్థితులు కుదుటపడ్డాయని ఊపిరిపీల్చుకుంటున్నారు.