భారత్ బ్యాటింగ్ ఫెయిల్యూర్..150కే ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ మొదటి టెస్టులోనే బోల్తా పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 41 రన్స్ చేసిన చివరి వికెట్ నితీష్ రెడ్డి టాప్ స్కోరర్ కావడం గమనార్హం. పంత్ 37, కేఎల్ రాహుల్ 26 రన్స్ చేసి మర్యాద కాపాడారు. యశస్వి జైస్వాల్, దేవదత్ డకౌట్ కాగా, కోహ్లీ, సుందర్, హర్షిత్, బుమ్రా సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకున్నారు. దీనితో భారత అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.