గెలుపు వాకిట్లో భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ రెండ్రోజుల్లోనే ఫలితం
బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా అడుగులేస్తోంది. కడపటి వార్తలందేసరికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగుల వద్ద 7 వికెట్లు పడ్డాయ్. అశ్విన్‌కు 3, జడేజాకు 3 వికెట్లు పడగా, ఆకాష్‌దీప్‌కు ఒక వికెట్ పడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 66 పరుగుల ఆధిక్యంలో ఉంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు ఆలౌట్ కాగా, ఇండియా 285/9 పరుగులు వద్ద డిక్లేర్డ్ చేసింది. వర్షం కారణంగా కాన్పూర్ లో జరుగుతున్న మ్యాచ్ మొదటి మూడు రోజులు ఎలాంటి ఆట ఆడకుండానే ముగిసింది. అయితే నాలుగో రోజు వరుణుడు అనుకూలించడంతో మ్యాచ్ కొనసాగుతోంది.



 
							 
							