రాజదండంపై ఇండియాకూటమికి ఏమాత్రం గౌరవం లేదు..యోగి
సమాజ్ వాది పార్టీ ఎంపీ ఆర్‌కే చౌదరి స్పీకర్ కుర్చీ పక్కన రాజదండాన్ని ఏర్పాటు చేయడంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఇండియాకూటమి నేతలకు, వారి మిత్ర పక్షాలకు ఏమాత్రం రాజదండంపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. ఎంపీ చౌదరి రాజరికానికి ప్రతీక అయిన సెంగోల్‌ను పార్లమెంటు నుండి తొలగించాలని వ్యాఖ్యానించగా, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ మద్దతునిచ్చారు. విపక్షాల తీరును బీజేపీ విమర్శిస్తోంది. సెంగోల్ రాజరికానికి ప్రతీక అయినే నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎందుకు అందుకున్నారని ప్రశ్నించింది. తమిళ సంస్కృతికి చెందిన ఈ సెంగోల్‌పై విమర్శలు చేయడాన్ని తమిళనాడు ప్రభుత్వం డీఎంకే పార్టీ మద్దతిస్తుందా అని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు.

