దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న, అయోధ్య శ్రీరాముడికి 2024 జనవరి 22న-ఈటల రాజేందర్
హిందూ బంధువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిరమన్నారు ఈటల రాజేందర్. హిందువుల దశాబ్దాల తరబడి రామమందిరం కోసం నినదిస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న సిద్ధించినప్పటికీ.. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మాత్రం జనవరి 22, 2024న ముక్తి లభిస్తోందన్నారు. అయోధ్య రామమందిరం-బాబ్రీ మస్జీద్ వ్యవహారంపై దశాబ్దాలుగా సాగిన వాదనల తర్వాత సుప్రీం కోర్టు తీర్పు తర్వాత రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ చేయడం సామాన్య విషయం కాదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ముందుచూపు, దార్శనికతతో బీజేపీ ప్రభుత్వం రామమందిర నిర్మాణాన్ని వడివడిగా చేపట్టిందన్నారు ఈటల రాజేందర్.

దేశ వ్యాప్తంగా హిందువులు శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధ్య దైవంగా కొలుస్తారని… రాముడు పుట్టిన అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం చేపట్టిన ఘనత బీజేపీ సర్కారుదేనన్నారు. హిందువుల చిరకాల కోరికను నిజం చేసిన చూపించిన ఘనత దేశంలో ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే దక్కుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రామమందిర నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు ఈటల రాజేందర్. దేశంలోని అన్ని మతాలు-కులాలు కలిసుండాలన్నదే ప్రధాని మోదీ ఆలోచనన్నారు ఈటల రాజేందర్. అయోధ్యలో రామమందిరం కోసం 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినందన్నారు ఈటల రాజేందర్. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు కృషి హిందూ బంధువులెవరూ కూడా మరవరన్నారు. అయోధ్యలో గొప్ప దేవాలయం కలను ఇద్దరు యోధులు నిజం చేశారన్నారు. రామభక్తులకు ఇకపై ఎలాంటి నిరీక్షణ ఉండబోదన్నారు ఈటల. జనవరి 23 నుంచి సామాన్యులు రామమందిరాన్ని జీవితంలో ఎప్పుడైనా వీక్షించవచ్చునన్నారు. స్వామి ఆశీస్సులు పొందవచ్చన్నారు.

ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేయడంతోపాటు, ప్రధాని నరేంద్ర మోదీ కొత్త అమృత్ భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లను అయోధ్య చేరుకునేందుకు ప్రారంభించారన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అయోధ్యలో రూ. 15,700 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టేందుకు నిర్ణయించారన్నారు. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా… 140 కోట్ల మంది భారతీయులు తమ ఇళ్లలో రామజ్యోతిని వెలిగించి దీపావళి జరుపుకోవాలన్న ప్రధాని సూచనను పాటిద్దామన్నారు ఈటల రాజేందర్. జనవరి 22న జరిగే చారిత్రాత్మక రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందన్నారు ఈటల రాజేందర్. గత పాలకలు వైఫల్యాల వల్ల రాముడు డేరాల్లో ఉన్నాడని.. ఈ రోజు రాముడు అధునాతన ఆలయాన్ని భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా కొలువై ఉండబోతున్నారన్నారు.

