అమెరికాలో వైభవంగా స్వాతంత్య్ర వేడుకలు
అగ్రరాజ్యమైన అమెరికాలో స్వాతంత్య్ర వేడుకలను వైభవంగా జరిగాయి. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన అమెరికా 1776లో జూలై 4న స్వాతంత్య్రం సంపాదించుకుంది. ఎన్నో ఏళ్లుగా అణచివేతకు గురయ్యింది అమెరికా. అర్థరాత్రి బాణాసంచా కాల్చి అట్టహాసంగా వేడుకను జరుపుకున్నారు అమెరికన్లు. సైన్యం కవాతును నిర్వహించింది. అమెరికా తన 247వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్ దేశ ప్రజలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపగా, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఎమోషనల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్‌లో జాతీయపతాకంతో నింగికెగరుతున్న రాకెట్ ఫొటోను షేర్ చేస్తూ ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అంటూ పోస్ట్ పెట్టారు.


