ఏపీలో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంపు
అమరావతి : మనసర్కార్:
ఆంధ్రప్రదేశ్‌లోని జూనియర్ డాక్టర్ల సమ్మె నిర్ణయానికి ఏపీ సర్కారు దిగిరాక తప్పలేదు. తమ స్టైఫండ్ పెంచకపోతే ఈ నెల 26 నుండి నిరవధిక సమ్మెను చేపడతామని సమ్మె నోటీసును ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. దీనితో ప్రభుత్వం వీరి డిమాండ్లకు తలొగ్గింది. వారి ఉపకారవేతనాన్ని పెంచుతూ కొద్ది సేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. వారు చదువుతున్న ఏడాదిని బట్టి ఈ పెంపుదల ఉంటుంది. అన్ని కేటగిరీలలో దాదాపు 15 శాతం వరకూ పెంచుతోంది. ఎంబీబీఎస్ విద్యార్ధులకు 3000వేల రూపాయలు, పీజీ విద్యార్థులకు 6000 వేల రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.