Home Page SliderTelangana

దివ్యాంగుల పెన్షన్ పెంపు

దివ్యాంగులకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ వారి పింఛన్‌ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. దీనిద్వారా 5 లక్షల 11 వేల 656 మంది దివ్యాంగులకు లబ్ది చేకూరనుందని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను ఆదుకునేందుకు , పెరుగుతున్న వయస్సుతో జీవనోపాధిని కోల్పోయిన వారు గౌరవప్రదంగా సామాజిక భద్రతతో కూడిన జీవితాన్ని గడపుటకు రోజువారీ కనీస అవసరాలకు ఆర్థిక మద్దతు అందించుటకు 2014 నవంబర్ లో ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రారంభంలో వృద్దులు, డివ్యాంగులు, హెచ్ ఐ వి – ఎయిడ్స్ బాధితులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు ఆసరా పెన్షన్ లను తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. తదుపరి బీడీ కార్మికులకు మార్చి’2015 నుండి ఒంటరి మహిళలకు ఏప్రిల్’2017 నుండి, ఫైలేరియా ప్రభావిత వ్యక్తులకు ఏప్రిల్’2018 నుండి , డయాలసిస్ బాధితులకు ఆగస్టు’2022 ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం వర్తింప జేసింది. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్సున్న ఆసరా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే . అలాగే వృద్ధాప్య పెన్షన్ పొందే అర్హత వయస్సును 65 నుండి 57 సంవత్సరాలకు ప్రభుత్వం తగ్గించింది. దీనితో కొత్త వృద్ధాప్య పెన్షన్ లతో పాటు వివిధ కేటగిరీల కు చెందిన 10 లక్షల లబ్దిదారులకు కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరు చేయుటకు ఆగస్టు’2022 లో ప్రభుత్వం ఆమోదించింది. ఆసరా పెన్షన్ ల కింద 2014 నుంచి 2022 -23 వరకు తెలంగాణ ప్రభుత్వం రూ.58,696 కోట్ల 25 లక్షలను ఆర్థిక భరోసా గా అందజేసింది. ఇప్పుడు దివ్యంగులకు పెంచిన ఆసరాతో వార్షికంగా ఆసరా కింద ఇచ్చే పెన్షన్ మొత్తం 11712 కోట్ల 24 లక్షలకు చేరుతుంది. 2014 తో పోల్చితే ఆసరా పెన్షన్ లబ్ది దారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ తాగు నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మానవీయకోణంలో కొనసాగుతున్న సీఎం కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొనియాడారు. దివ్యాంగులు ఇక మీదట రూ. 4,016 అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ది. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే దివ్యాంగులకు నెలవారీ ఇస్తున్న పింఛన్లు ఇలా ఉన్నాయి.

కర్ణాటక : 1,100
రాజస్థాన్‌ : 750
ఛత్తీస్‌గఢ్‌: 500
ఉత్తర్‌ప్రదేశ్‌ : 1,000
మహారాష్ట్ర : 300
మధ్యప్రదేశ్‌ : 300
ఆంధ్రప్రదేశ్‌: 3,000
బీహార్‌ : 500
మిజోరం: 100
ఒడిశా: 200
జార్ఖండ్‌ : 700
తమిళనాడు: 1,000
కేరళ : 1,300

దేశంలో ఏ రాష్ట్రం లో ఇంత మొత్తంలో పెన్షన్ ఇవ్వడం లేదు. దివ్యంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని నగర కమిషనర్ తెలియజేశారు.